కాకినాడ: దీప్తిశ్రీ కథ విషాదాంతం మృతదేహాన్ని బయటకు తీసిన ధర్మాడి సత్యం టీమ్


తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కనిపించుకుండా పోయిన దీప్తిశ్రీ కథ విషాదాంతమయ్యింది


తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కనిపించుకుండా పోయిన దీప్తిశ్రీ కథ విషాదాంతమయ్యింది. మూడు తర్వాత దీప్తిశ్రీ మూటలో కనిపించింది. ఉప్పుటేరులో గాలింపు చేపట్టిన ధర్మాడి సత్యం టీమ్ సోమవారం మధ్యాహ్నం చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. దీప్తిశ్రీని చంపి మూటలో కట్టి ఉప్పుటేరులో పడేసినట్లు తేల్చారు. డెడ్ బాడీని పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు. మూడు రోజుల మిస్సింగ్ మిస్టరీ విషాదంగా ముగిసింది.


స్థానికులు, పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. కాకినాడ పగడాల పేటకు చెందిన సత్య శ్యామ్‌కుమార్‌, సత్యవేణిలకు గతంలో వివాహంకాగా.. దీప్తి శ్రీ సంతానం. రెండేళ్ల క్రితం సత్యవేణి అనారోగ్యంతో చనిపోవడంతో.. శ్యామ్‌కుమార్‌ శాంతి కుమారిని రెండోపెళ్లి చేసుకున్నాడు.. వారికి మరో 13 నెలల బాబు ఉన్నాడు. రెండో పెళ్లి తర్వాత కూడా శ్యామ్‌కుమార్ కుటుంబం ఆనందంతో ఉంది. మొదటి భార్య కూతురు దీప్తిశ్రీ స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. ః

మూడు రోజుల క్రితం స్కూల్‌కు వెళ్లిన దీప్తిశ్రీ.. మధ్యాహ్నం నుంచి కనిపించుకుండా పోయింది. స్కూల్ దగ్గర బాలిక గురించి ఆరా తీసిన తండ్రి శ్యామ్‌కుమార్.. కూతురు కిడ్నాపైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు.. ఓ మహిళ వచ్చి దీప్తిశ్రీని పాఠశాల నుంచి బయటకు తీసుకెళ్లినట్లు గుర్తించారు.

తన భార్య శాంతికుమారిపై భర్త శ్యామ్‌కుమార్ అనుమానం వ్యక్తం చేశాడు. తండ్రి మొదటి భార్య సంతానమైన దీప్తిశ్రీపైనే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని భావించిన సవతి తల్లి.. ఆమెను చిత్రహింసలు పెట్టేదట. ఎవరికైనా చెప్తే చంపేస్తానని పాపను బెదిరించిందట. ఓ రోజు బాలిక ఒంటిపై వాతలు పెట్టడంతో.. తండ్రి శ్యామ్ కుమార్ నిలదీశాడు. అదే అనుమానంతో శ్యామ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు.


Please Follow the page for more updates 


Comments

Popular posts from this blog

తొలి టీ20: కోహ్లి నోట్‌బుక్‌ సెలబ్రేషన్‌!

జై చిత్తూరు పోలీస్" జై జై చిత్తూరు పోలీస్" షేర్ చేసి పోలీసు వారికి ధన్యవాదాలు తెలుపు దాము మిత్రులారా