Popular posts from this blog
తొలి టీ20: కోహ్లి నోట్‌బుక్ సెలబ్రేషన్!
తొలి టీ20: కోహ్లి నోట్‌బుక్ సెలబ్రేషన్! హైదరాబాద్: తన బ్యాట్‌తో పరుగుల వరద పారించే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. నిత్యం ఏదో రకమైన విషయాలతో వార్తల్లో నిలుస్తుంటాడు. అయితే హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఓ అరుదైన సంఘటనతో మరోసారి వార్తల్లోకెక్కాడు. విషయం ఏంటంటే.. శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాడు విలియమ్స్‌ను ఉద్దేశించి కోహ్లి తన చేతిని వర్చువల్ 'నోట్‌బుక్'గా మార్చి.. బుక్ తీసి టిక్ కొడుతున్నట్లు చేసిన విన్యాసం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో ఓ మ్యాచ్ సందర్భంగా తన వికెట్ తీసి సంబరాలు చేసుకున్నవిలియమ్స్‌కు అదే రీతిలో కౌంటర్ ఇచ్చాడంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక 208 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు విజయానికి 30 బంతుల్లో 54 పరుగులు కావాల్సిన సమయంలో.. కోహ్లీ క్రీజులో ఉండటంతో మ్యాచ్ అప్పటికీ టీమిండియా చేతిలోనే ఉంది. విలియమ్స్ 16వ ఓవర్లో రెండో బంతిని అతని తలపై నుంచి కోహ్లి నేరుగా బౌండరీకి తరలించాడు. ఆ తర్వాతి బంతిని లాంగాన్‌లో కళ్లు చెదిరే సిక్సర్‌గా మలిచాడ...

Comments
Post a Comment